గూడూరు, మనం న్యూస్ :- డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు భారతీయ ప్రజలకు స్ఫూర్తి దాయకమని గూడూరు అర్బన్ మండలం బిజెపి అధ్యక్షులు కే దయాకర్ పేర్కొన్నారు. ఆదివారం
గూడూరు నియోజకవర్గం గూడూరు నగర బిజెపి కార్యాలయం నందు గూడూరు అర్బన్ మండలం బిజెపి అధ్యక్షులు అధ్యక్షులు కె దయాకర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను బిజెపి నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం గూడూరు అర్బన్ మండల పార్టీ బిజెపి అధ్యక్షులు దయాకర్ మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు దేశ ప్రజలకు ఆదర్శమని ఆయన సేవలను భారతీయులకు స్ఫూర్తి దాయకమన్నారు. బిజెపి సీనియర్ నాయకులు, గూడూరు అర్బన్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ ఒకే దేశంలో పెద్ద ప్రధానులు రెండు జాతీయ పతాకాలు రాజ్యాంగంలో ఉండకూడదని వ్యతిరేకించిన గొప్ప హిందూ వాదనే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర బిజెపి నాయకులు గుంజి శ్రీనివాస్ రావు, ఐ సురేష్ బాబు, కో కన్వీనర్ కే నరేంద్ర, గుమ్మడి శ్రీనివాస్, సిహెచ్ శివ, సిహెచ్ నిరంజన్, జి సాయి, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.