గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వాకర్స్ కొరకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికి అభినందనలు తెలిపారు. డాక్టర్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వాకర్స్ అందరికీ ఆరోగ్యం కొరకు తగిన జాగ్రత్తలు తెలియజేసినందుకు డాక్టర్లందరిని అభినందిస్తున్నాను అని చెప్పారు. అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తూ మందులు కూడా ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. మరియు ఈ స్టేడియం అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని ఇంకా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా గోపాల్, డాక్టర్ కీర్తి, డాక్టర్ త్రివిక్రమ్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ నాగరాజు, వేగూరు రాజేంద్రప్రసాద్, వసంత్, శర్మ, విజయ్, కాలేషా, సురేష్, వేమా వెంకటేశ్వర్లు, KV హాస్పిటల్ వైద్య సిబ్బంది, వాకర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.