మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని,మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగాbఈ రోజు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికి ప్రాధమిక హక్కులను కల్పించడంతో పాటు ప్రజల ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని చట్టాలను సైతం పొందుపరిచారని చెప్పారు.ప్రజల రక్షణ,శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాలుగా ఏర్పడిన పోలీస్ వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.అనంతరం అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు పోలీసు అధికారులు,సిబ్బంది చేత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు చంద్రభాను,రెహమాన్,సతీష్ కుమార్, రవీందర్ రెడ్డి,మల్లయ్య స్వామీ, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, సీసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, జిల్లాలోని సీఐలు,ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.