మన న్యూస్: పినపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా ఏడుళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం ఉపాధ్యాయులు తో మాట్లాడి విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించాలని తెలియజేశారు విద్యార్థులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు అన్ని సమకూరుస్తుందని మెరుగైన విద్యను పొంది దేశానికి, కుటుంబానికి ఆదర్శంగా నిలవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథం గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు