శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి అపురూప్:- సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని మాజీమంత్రి వైసీపీ పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం అన్నారు. కిర్లంపూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన వన దుర్గమ్మ ఆలయంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ కిర్లంపూడి గ్రామంలో వన దుర్గమ్మ ఆలయం వద్ద ప్రతి శుక్రవారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. గ్రామంలో ప్రతి చోట ఆలయాలు వద్ద అన్నదాన కార్యక్రమాలకు సహాయ సహకారాలను అందిస్తున్న దాతల సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, ఆలయ కమిటీ సభ్యులు పెంటకోట శ్రీరాములు, చిక్కాలా చిన్నా, పాలిక శ్రీను, దాడి లోవ, పవర్ కిట్టబాబు తదితరులు పాల్గొన్నారు.