కలిగిరి,మనన్యూస్ : కలిగిరి మండలం క్రాకుటూరు గ్రామానికి చెందిన మన్నేటి శ్రీ దేవమ్మ గారికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి పత్రాన్ని అందజేశారు.
వింజమూరు లోని క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం బాధితులకు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల చేతులమీదుగా చెక్కును పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మెడికల్ కళాశాల నందు వైద్యం, మరియు ఆపరేషన్ చేయించుకున్నందుకుగాను, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి చొరవతో ఎల్ ఓ సి మంజూరు చేయించడం జరిగిందన్నారు. మా కుటుంబానికి అండగా నిలిచిన వారికి ఎల్లవేళలా కృతజ్ఞత భావం కలిగి ఉంటామని, ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.