మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయిస్ యూనియన్ పిలుపుమేరకు ఏలేశ్వరంలో కార్మికులు శుక్రవారం గేటు ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పెండెం సత్యానందం మాట్లాడుతూ 11 వ పి.ఆర్.సి బకాయిలు చెల్లించాలని,12 వ పి ఆర్ సి నియమించాలని, ఉద్యోగ భద్రత సర్కిల్ 1/2019 ని పకడ్బందీగా అమలు చేయాలని, ఆగస్టు 15 నుండి మహిళలకు ప్రీ బస్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తున్నందున అదనంగా 3,000 బస్సులు సమకూర్చి పదివేల మంది నూతన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఆర్ కృష్ణ, డిపో అధ్యక్షుడు నాని బాబు, సి సి ఎస్ డెలికేట్ ఊబ నల్లయ్య, ఎన్.వి. రావు, గ్యారేజీ చలం, ప్రసాద్, ఎల్ వి ఎస్ నారాయణ, డి ఎస్ విజయ, సి హెచ్ వి లక్ష్మి, శ్యామల, జ్యోతి కార్మికులు పాల్గొన్నారు.