ఉరవకొండ మన మన న్యూస్ జులై 4: దేశవ్యాప్తంగా జిఎస్టి సరళీకరణ చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీతో ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం భేటీ అయ్యారు. కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వస్తున్న జీఎస్టీ పన్నుల సరళిని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమైనది. గోవా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ఐసి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. *ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సభ్యులుగా గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ పి. సావంత్ కన్వీనర్ గా ఉండగా ఉన్నారు. సభ్యులుగా బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, చత్తీస్ గడ్ ఆర్థిక మంత్రి ఓం ప్రకాష్ చౌదరి, గుజరాత్ ఆర్థిక మరియు ఇంధన శాఖ మంత్రి కనుభాయ్ దేశాయ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్, పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, తమిళనాడు ఆర్థిక మరియు మానవ వనరుల నిర్వహణ మంత్రి తంగం తెన్నరసు, తెలంగాణ ఆర్థిక & ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు.