మన న్యూస్: తిరుపతి, నవంబర్ 26,
తిరుపతి ప్రజల ఇలవేల్పు తాతయ్యగంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను తర్వలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. రానున్న గంగ జాతర నాటికి ప్రజలకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం తమ బాధ్యతని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం ఆలయ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆలయ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమైయ్యారు. ఆలయంలో జరుగుతున్న పనుల తీరును ఇంజినీరింగ్ అధికారలు ఎమ్మెల్యేకి వివరించారు. దేవాదాయ శాఖ,టిటిడి, దాతలు ఇచ్చిన నిధులతో చేపట్టిన పనులు 70శాతం వరకు పూర్తయినట్లు వారు ఎమ్మెల్యేకి తెలిపారు. మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అధికారులు ఎమ్మెల్యేకి తెలిపారు. నడివీధి గంగమ్మగా పూజలందుకుంటున్న శ్రీవేంకటేశ్వర స్వామి చెల్లెలు ఆలయ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చెప్పారు. వచ్చే ఏడాది మే నెలలో జరిగే గంగ జాతర నాటికి అన్ని పననులు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. గంగమ్మ తల్లి దర్శనంలో వివక్ష లేకుండా చూడటంతోపాటు ఆలయ సాంప్రదాయాలు తూచతప్పకుండా అమలు అయ్యేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి దాతలు ఇతోధికంగా సాయం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈఓ జయకుమార్, టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహయాదవ్, టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జీలు పులుగోరు మురళీ, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, మహేష్ యాదవ్, భరణి యాదవ్, దొడ్డారెడ్డి రామకృష్ణా రెడ్డి, దొడ్డారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, గంజి సుధాకర్ రెడ్డి, బిజేపి రాష్ట్ర అధికారప్రతినిధి సామంచి శ్రీనివాస్, గుండాల గోపినాథ్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కార్పోరేటర్ నరసింహాచ్చారి, నగర అధ్యక్షులు రాజా రెడ్డి, కీర్తన, బాబ్జీ, హరిశంకర్, ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, ఆర్కాట్ కృష్ణయ్య, నెలవాయి మురళీ, రాజేష్ యాదవ్, మునస్వామి, సాని శ్రీనివాస్, పవన్ కుమార్, మోహన్ రాయల్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.