గూడూరు, మన న్యూస్ :- జులై 6వ తేదీ జొనోసిస్ డే సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాధి రాకుండా ఉచిత టీకాలను వేస్తామని గూడూరు ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు సురేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పాడిరైతులు, పెంపుడు కుక్కలు , పిల్లులు యజమానులకు జంతువుల నుండి పశువులకు , మనుషుల నుండి జంతువులకు సంక్రమించు వ్యాధులు ( జొనోటిక్ వ్యాధులు ) గురించి అవగాహణ కల్పిస్తారన్నారు. కుక్కలకు రేబిస్ వ్యాధి రాకుండా ఉచితంగా టీకాలు వేస్తామని తెలిపారు.పెంపుడు జంతువుల యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.