మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక
వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ చట్టాలపై "మిషన్ వాత్సల్య" పేరిట నిర్వహించిన అవగాహన సదస్సు లో ఎమ్మెల్యే సత్య ప్రభ పాల్గొన్నారు..కార్యక్రమంలో భాగంగా శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయమును ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని, బాలల బంగారు భవిష్యత్తు కోసం సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వారి కర్తవ్యాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎన్ని చట్టాలున్నా, ఎన్ని న్యాయస్థానాలు ఉన్నా మనిషిలో పరివర్తన ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమని ఎమ్మెల్యే అన్నారు. బాలల వికాసం కోసం,అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని , వాటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా వారి వికాసానికి తోడ్పాటు అందించవలసిన ఆవశ్యకత అధికారుల పైన , సమాజంలో ప్రతి ఒక్కరి పైన ఉందని ఎమ్మెల్యే అన్నారు.. బాల్య వివాహాలు, బాలల అమ్మకం, బాలల శ్రమదోపిడి, బాల కార్మిక వ్యవస్థ వంటి అంశాలపై లోతైన అధ్యయనం ద్వారానే వ్యవస్థలో మార్పులు తీసుకు రాగలమని అన్నారు.. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..