వెదురుకుప్పం మన న్యూస్: కార్వేటినగరం మండలంలోని అన్నూరు వద్ద ఉన్న ఏబీసీ గుజ్జు పరిశ్రమ కి సంబంధించిన టోకెన్ లను కొంతమంది దళారులు ఏకంగా నకిలీ టోకెన్లను సృష్టించి రైతులకు సుమారు 3000 నుంచి 5000 వరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ విషయాన్ని ఫ్యాక్టరీ సిబ్బంది గురువారం సాయంత్రం ఓ ట్రాక్టర్ లో మామిడి కాయలను తీసుకొచ్చినప్పుడు గుర్తించినట్లు తెలుస్తుంది. ఆ వ్యక్తిని సిబ్బంది విచారించగా ఇప్పటికి ఫ్యాక్టరీ లోపలికి వచ్చి అన్లోడ్ కాకుండా ఉన్న సుమారు 19 టాక్టర్ లను గుర్తించినట్లు సిబ్బంది తెలియజేశారు. ఈ నకిలీ టోకెన్ ప్రింటింగ్ దందాలో ఓ టిడిపి కీలక నేత మరియు పుత్తూరు కు చెందిన మామిడి మండి కి చెందిన వ్యక్తి కూడాఉన్నట్లు సమాచారం. మామిడి రైతుల కష్టాన్ని అలుసుగా తీసుకొని తెలుగు తమ్ముడు చేతివాటo ప్రదర్శించినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై ఫ్యాక్టరీ సిబ్బంది రేపు పోలీసులు ఫిర్యాదు చేయునట్లు సమాచారం. నకిలీ టోకెన్లు సూచించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు దళారులు నమ్మి మోసపోకుండా టోకెన్ల కోసం ఫ్యాక్టరీ సిబ్బందిని నేరుగా సంప్రదించాలని ఫ్యాక్టరీ సిబ్బంది తెలిపారు.