మన న్యూస్,ఎస్ఆర్ పురం:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని గంగాధర నెల్లూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు కిషోర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో భాగంగా కిషోర్ రెడ్డి అధినేత జగనన్నను కలిసారు. ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు చంద్రబాబు మోసపూరిత హామీలతో మోసపోయారని రానున్న కాలంలో జగనన్న సారథ్యంలో యువతకు మంచి జరుగుతుందని ఆశించారు. గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో ఇన్చార్జి కృపా లక్ష్మి ఆధ్వర్యంలో రానున్న రోజులలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్నారు.