మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) జూలై 2:నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం ఆమె సబ్ కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజల దరఖాస్తులపై సకాలంలో స్పందన ఇవ్వడం అధికారులు నైతిక బాధ్యత.అప్రమత్తత లేకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు ఆమె తెలియజేశారు.నిజాంసాగర్ మండల పరిధిలో మొత్తం 1,195 భూ రికార్డు సవరణ దరఖాస్తులు అందినట్లు నమోదు కాగా,ఇప్పటివరకు కేవలం 36 రైతులకు మాత్రమే నోటీసులు జారీ చేయడం గమనార్హం.అత్యధికంగా మల్లూరు గ్రామానికి చెందిన 356 దరఖాస్తులు ఉండటాన్ని సబ్ కలెక్టర్ ప్రస్తావిస్తూ, సమయపాలనపై అధికారులను ఖచ్చితంగా పాటించాలంటూ ఆదేశించారు.అధికారుల పనితీరు పట్ల సమీక్షిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరచాలని సూచించారు.ఆమె వెంట తహశీల్దార్ భిక్షపతి,ఆర్ఐ సాయిలు,సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్,సర్వేయర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.