సుపరిపాలన ముందడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
చిల్లకూరు, బుధవారం: చిల్లకూరు మండలంలోని తిక్కవరం గ్రామాన్ని బుధవారం గూడూరు శాసనసభ్యులు పి. సునీల్ కుమార్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న "సుపరిపాలన ముందడుగు" కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పర్యటనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ గ్రామంలో ఇల్లిళ్లు తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. వారితో ప్రత్యక్షంగా సంభాషిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు. ఆయా పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ప్రభుత్వం చేస్తున్న సేవల్ని నేరుగా ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్తులు ఆయన్ను ఉత్సాహంగా స్వాగతించి తమ సమస్యలు మరియు అభిప్రాయాలను చర్చించారు. అధికారులతో కలిసి అనేక సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు మరియు గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.