పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- పినపాక మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన పూణెం సంప్రీత్ (31) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే మణుగూరు సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు దళారులు చెప్పగా…లక్ష యాబై వేలు అప్పుచేసి కడితే సంవత్సర కాలం నుంచి ఉద్యోగం ఇవ్వకుండా తిప్పిస్తున్నారని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఉద్యోగం లేక అప్పు తెచ్చిన డబ్బులకి వడ్డీ కట్టలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఉద్యోగం రావట్లేదని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు తెలిపారు. వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు