మన న్యూస్ తవణంపల్లె జులై-2
సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనతో తొలి అడుగు" ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని *"పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్"* తిరుగులేని అపార ప్రజా స్పందనతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తవణంపల్లె మండలం, తెల్లగుండ్లపల్లె గ్రామంలోకి ఎమ్మెల్యే మురళీమోహన్ విచ్చేసిన సందర్భంగా మండల నాయకులు, ప్రజలు గజమాలలు వేసి, దుశ్శాలువులతో ఘనంగా సత్కరించారు. మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం తెల్లగుండ్లపల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పర్యటించిన ఆయన ఇంటింటికి వెళ్లి, కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రతి ఇంటికీ ప్రభుత్వ పధకాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజల మద్దతే కూటమి ప్రభుత్వం బలమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ప్రజల ముందే చెప్పేందుకు ఈ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం” అని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం పరిశీలకులు బొమ్మన శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లె మండల అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్ నాయుడు, బంగారుపాళ్యం మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, ఐరాల మాజీ మండల అధ్యక్షులు గిరిధర్ బాబు, క్లస్టర్ ఇంఛార్జ్స్ మోహన్ నాయుడు, సునీల్ కుమార్ చౌదరి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పాల్గోన్నారు.