మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న పనితీరు,అధికారుల హాజరు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు.భూ సమాచారం అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ద్వారా భూముల డిజిటల్ నమోదు,పటాల రూపకల్పన, రైతుల వ్యక్తిగత భూవివరాలు తదితర అంశాలను ఆమె జాగ్రత్తగా పరిశీలించారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.
ప్రతి రైతుకు తన భూమిపై పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. భూభారతి సమాచారం గ్రామ స్థాయిలో సక్రమంగా ఉండేలా అధికారులు పని చేయాలి. ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించడానికి తహసీల్దార్ కార్యాలయం సమర్థవంతంగా పనిచేయాలి అని వివరించారు.అలాగే కార్యాలయానికి వచ్చే ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, ఫిర్యాదుల పరిష్కార పరిస్థితులను సమీక్షించిన ఆమె,ప్రజలకు వేగవంతంగా సేవలు అందించాలన్న దిశగా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సవాయ్ సింగ్,డిప్యూటీ తహసీల్దార్ శరత్ కుమార్, ఆర్ఎ పండరీ తదితర అధికారులు పాల్గొన్నారు.