మన న్యూస్ సాలూరు జూలై 1:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ అప్పలనాయుడు స్థానిక విలేకరుల అందించిన సమాచారం మేరకు మంగళవారం పట్టణంలోని ఎరుకల వీధిలో దాసరి సన్యాసిరావు ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో 13 మంది పేకాట వాడుతుండగా వారిని పట్టుకున్నామని కేసు నమోదు చేశామని తెలిపారు. వారి వద్ద ఉన్న 23,800 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ లను పేక ముక్కలను సీజ్ చేసామన్నారు.