మన న్యూస్: పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మంగళవారం అశ్వాపురంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి, మాట్లాడుతూ అశ్వాపురం మండలం స్థానిక గొందుగూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా హాస్టల్లో కనీసం మెనూ అమలు చేసే పరిస్థితి లేకుండా మేము పెట్టిందే తినాలి లేకపోతే మీ ఇంటికి మీరు వెళ్లిపోండి అని విద్యార్థులను బెదిరిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ భయాందోళన గురిచేస్తూన్నా, హెచ్ఎం, వార్డెన్ ల, మీద ఇంతవరకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు గిరిజన విద్యార్థుల పై చిన్నచూపు చూస్తూ భయాందోళన గురి చేస్తున్న ఇంకా ఉన్నతాధికారులు పట్టనట్టే ఉన్నారని ఉన్న విద్యార్థులకు హాస్టల్లో ఉన్న విద్యార్థులకు అసలు సంబంధం లేదని జిసిసి నుండి వస్తున్న పప్పు ఉప్పు బియ్యాన్ని అన్నిటిని మాయం చేస్తూ పబ్బం కట్టుకుంటున్నారని వెంటనే ఐ టి డి ఓ పి ఓ, జిల్లా కలెక్టర్ స్పందించి గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని గిరిజన ఆశ్రమ పాఠశాల అశ్వాపురం మండలం ఒకసారి విసిట్ చేయాలని, అఖిల భారత విద్యార్థి సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో
ఏఐఎస్ఎఫ్ పినపాక నియోజకవర్గ కార్యదర్శి అక్కినపల్లి నాగేంద్రబాబు, రాజు, రాము, రాహుల్, రఘు, తదితరులు పాల్గొన్నారు..