మన న్యూస్, సాలూరు జూలై 1 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ని మామిడిపిల్లి, అన్నంరాజు వలస గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి, రైతులకు పలు సూచనలు సలహాలు అందజేసిన మండల వ్యవసాయ శాఖ అధికారి కె. శిరీష. మంగళవారం పై గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి శిరీష నిర్వహించారు. ఈ మేరకు రైతులకు వరి నారుమడులు తయారు చేసుకోవడానికి వెదజల్లడానికి ఇది సరైన సమయమని అలాగే 48 గంటల లోపు కలుపు నివారణకు పిండమిత్తాలిన్, ప్రిటాలాక్లోర్ తదితర కలుపు మందుల వల్ల నివారించుకోవచ్చాన్నారు. ఒక ఎకరంలో దుక్కు దున్ని పశువుల గత్తం వేసుకొని ఎకరానికి ఐదు సెంట్లు నారుమడులలో విత్తనాలు జల్లు కోవాలన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్న మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులకు తగు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఈలు శ్రీను, తిరుపతిరావు, విఏఏ సంధ్య రైతులు పాల్గొన్నారు.