గూడూరు, మన న్యూస్ :- గూడూరు రెండో పట్టణ పరిధిలోని బాలసదనంలో ఆర్ బి ఎస్ కే వైద్యులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంగళవారం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆర్ బి ఎస్ కే వైద్య సిబ్బంది విద్యార్థినులకు వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో చిన్నపిల్లల వైద్యులు ప్రదీప్, డి ఈ ఐ సి మేనేజరు డాక్టర్ ఆర్ గుణశేఖర్, డాక్టర్ ఝాన్సీ రాణి డాక్టర్ దీప్తి మధుబాబు లు విద్యార్థినులకు పలు పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలసదనం వార్డెన్ అరుణ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.