గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో సోమవారం సాయంత్రం తాసిల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ పౌర హక్కులపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఇల్లు లేని పేదలకు త్వరలోనే ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని, స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ఆధార్ కార్డులు లేనివారికి ఆధార్లను అందించడం జరుగుతుందని,ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని చక్కగా చదివించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ పూర్ణ, మాజీ సర్పంచ్ నెల్లూరు రామ్మూర్తి,హొసింగ్ ఏఈ షబ్బీర్,సోషల్ వెల్ఫేర్ hw పద్మజ,ఎలక్రీకల్ డిపార్ట్మెంట్ లైన్ మెన్ మల్లి కార్జున, హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.