మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాకల గ్రామానికి చెందిన రేణుమాల లాజర్ (వయస్సు 62) ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సహకారులతో కలిసి పని చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై ప్రాథమిక సహాయం అందించేందుకు ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు.