తుర్కయంజాల్, మన న్యూస్:- ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ శివ సాయి నగర్ కాలనీలో భక్తి శ్రద్ధలతో మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొత్త కురుమ మంగమ్మ – శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి, కుమ్మర సోదర–సోదరీమణులతో యాట బోనాన్ని ఎత్తి అమ్మవారికి నివేదించారు. ఆయా కుటుంబాలు మైసమ్మ అమ్మవారిని కొలిచి, బోనాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాంతీయంగా విశేషంగా పరిగణించే ఈ బోనం – ఈ ఏడాది తొలి కుమ్మరుల బోనంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాలనీవాసుల సమక్షంలో ఉత్సాహభరితంగా జరిగిన ఈ బోనాల వేడుకలో సంప్రదాయ గర్జనలు, కోలాటాలు, పల్లకీ సేవలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.