సాలూరు, నవంబరు25( మన న్యూస్):=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు సాలూరుమండలంలోగిరిజనులకు డోలిమాతలు తప్పించేందుకే కరడవలసలో కంటైనర్ ఆసుపత్రి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,కరడవలసలో గిరిజన గర్భిణీలకు సీమంతాలు చేసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, సాలూరు మండలం కరడవలస పంచాయితీలో కంటైనర్ ఆసుపత్రిని స్త్రీ సంక్షేమం, గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. గిరి శిఖర గ్రామాల గిరిజనులు అనారోగ్యానికి గురైనప్పుడు అలాగే గర్భిణీ స్త్రీలు ప్రసవాల కోసం డోలిమోతలతో ఆసుపత్రికి తీసుకుని రావాల్సిన పరిస్థితి గతంలో ఉండేదని కూటమి ప్రభుత్వంలో అలా జరగకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిరి ఆరోగ్య కేంద్రం కంటైనర్ ఆసుపత్రిలు ఏర్పాటు చేస్తున్నామని దానిలో భాగంగా కరడవలసలో గిరి ఆరోగ్య కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా కంటైనర్ ఆస్పత్రిని ప్రారంభించామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ కంటైనర్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ గది, రోగులకు చికిత్స అందించడానికి నాలుగు మంచాలతో కూడిన గది, 15 రకాల వైద్య పరీక్షలు, అవసరమైన మందులు ఈ కంటైనర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కంటైనర్ ఆస్పత్రి ద్వారా కర డవలస పంచాయతీకి చెందిన 10 గ్రామాల గిరిజనులకు అందుబాటులో ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.