గూడూరు, మన న్యూస్:- శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు.మంగళవారం యథావిధిగా హాస్టల్లో టిఫిన్ చేసి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు వీరిని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు వైయస్సార్సీపి బీసీ నాయకుడు వడ్ల తాంగల్ బాలాజీ రెడ్డి చిన్నారులను పరామర్శించినారు. అనంతరం అక్కడే విధులు నిర్వహిస్తున్న డాక్టర్లను చిన్నారులకు అందిస్తున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ హాస్టల్ పిల్లలుకి ఫుడ్ పాయిజన్ కావడంతో 16 మంది హాస్పిటల్ చేర్చడం జరిగింది అయితే అదృష్టవశాత్తు పిల్లలకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా వెంటనే డాక్టర్స్ అందరూ కూడా సమన్వయం చేసుకున్నారు కాబట్టి ఇటువంటి ప్రమాదం జరగలేదు డాక్టర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అయితే వచ్చిన హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా ఆ విధంగా కాకుండా పిల్లలు యొక్క భవిష్యత్తు పిల్లలు యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత హాస్టల్ వార్డెన్ ది అయితే ఆ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఉదయం అల్పాహారం అందించే ఇడ్లీ పిండిని పరిశీలించకుండా చిన్నారులకు అందజేశారు హాస్టల్ వార్డెన్ ప్రతిరోజు పిల్లలకు అందించే ఆహారాన్ని పరిశీలచిన తర్వాతనే పిల్లలకు అందజేయాలి.హాస్టల్ వార్డెన్ వెంటనే శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ సంఘటన గురించి స్పందించిన డిఎంహెచ్వో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తిరుపతి జిల్లా ఆర్టిఓ వచ్చినారు వారు అందరీ రాక మంచి పరిణామమే.ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా అధికారులు దృష్టి పెట్టాల్సిందిగా అధికారులకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ వైయస్సార్సీపి యువజన సంఘం అధ్యక్షుడు శ్రీవారి సురేష్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిశెట్టి విజయ్ శేఖర్, పెరుమాళ్ చౌదరి మరియు విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.