మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సమావేశం విజయవాడలోని టూరిజం పున్నమి ఘాట్లో ఈనెల 18న నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర బిసప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోసఫ్ బిషప్ ఆండ్రూస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం పెద్దవీధి సి ఓ ఎం చర్చి దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆండ్రూస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.రాష్ట్ర బిసప్ కౌన్సిల్ అధ్యక్షులు ఎజ్జల బాలరాజుకు, ఉపాధ్యక్షులు మోహన్ రావుకు,సెక్రటరీ దైవ ప్రకాష్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘ దైవజనుడుగా సీనియార్టీని గుర్తించి జిల్లాస్థాయిలో అనేక పదవులు చేపట్టిన నాకు, రాష్ట్రస్థాయిలో పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే క్రైస్తవ సమాజాన్ని ఏకతాత్పర్యంతో కలిగి ఉండాలని, భారతదేశంలో విమర్శనాత్మకమైన మాటలు మాట్లాడకూడదని ఆయన అన్నారు.