మన న్యూస్ సాలూరు జూన్ 23:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో సాగు చేస్తున్న భూములకు పట్టాలి ఇవ్వాలి. బొర్రాపనుకువలస జిల్లేడు వలస గ్రామ గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సాలూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసి గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు వంతల సుందర్రావు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మండల కార్యదర్శి తాడంగి ఘాసి మాట్లాడుతూ మండలంలో గతంలో అటవీ బంజరు భూములకు పట్టాలిస్తామని సర్వేలు చేశారు కానీ పూర్తిస్థాయిలో పట్టాలు పంపిణీ చేయలేదని తెలిపారు ఇప్పటికైనా పట్టాలు పంపిణీ పూర్తిస్థాయిలో చేయాలని డిమాండ్ చేశారు అలాగే గతంలో ఆందోళన పోరాటాలు సందర్భంగా బోర్ర పనుకువలస జిల్లేడు వలస గ్రామ గిరిజనులకు అటవీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. గతంలో ఇచ్చిన అటవీ పట్టాలకు 1బి రావడం లేకపోవడం వలన బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు 1 బీ లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు విఆర్ఎస్ మిగులు భూములు అనే స్థానిక గిరిజనులు సాగు చేసుకుంటున్న నేటి వరకు పట్టాలు పంపిణీ చేయలేదని తెలిపారు గతంలో పట్టాలిస్తామని సర్వేలు చేశారని నేటి వరకు పట్టాలు పంపిణీ కాలేదని తెలిపారు ఇప్పటికైనా పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు మండలంలో అన్సర్వేడు భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు లేనియెడల ఆందోళన పోరాటాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు గిరిజన సంఘం నాయకులు ఉయ్యాల గౌరయ్య బోయిన సన్యాసి సూకురు గంగయ్య చింత జోగయ్య తదితరులు పాల్గొన్నారు.