మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు చింతారెడ్డి పాలెం వై.సి.పి రూరల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు కార్యకర్తలు.నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారుస్తూ ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేస్తున్న ఆనం విజయకుమార్ రెడ్డి పైన పచ్చిఅబద్దాలతో మీడియా సమావేశం నిర్వహించి అక్కసుతో అబండాలు వేసి అవాస్తవాలతో మాట్లాడిన ప్రతి మాట అబద్దాలు చెప్పి పార్టీ కి చాలా ద్రోహం చేస్తూ పార్టీకి ఎంతో నష్టం చేస్తున్న వై.ఎస్.ఆర్.సిపి.మాజీ నగర అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి కి సరైన రీతిలో కౌంటర్ ఇచ్చి సమాధానం చెప్పిన నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్.సిపి నాయకులు కార్యకర్తలు.నిన్నటి రోజున బొబ్బల శ్రీనివాస్ యాదవ్ కి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడిగా పదవి వచ్చినందుకు అక్కసుతో కొంతమంది అధికార పార్టీ నాయకుల కళ్ళలో ఆనందం కోసం పార్టీకి ద్రోహం చేస్తూ పార్టీకి ఎంతో నష్టం చేస్తున్న కొంతమంది కోవర్టు మనస్సులని సంతోష పెట్టడానికి అసత్యపు,అడ్డమైన అబద్ధాలతో అనవసరమైన మీడియా సమావేశం నిర్వహించి అభూత కల్పనతో అబద్ధాలు చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై అబండాలు వేసి విమర్శించిన మాజీ నగర అధ్యక్షుడు సన్నప్పరెడ్డి పెంచల రెడ్డి కి మరియు మరికొంతమంది కోవర్టులకు సరైన రీతిలో కౌంటర్ ఇచ్చి సమాధానం చెప్పిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు.మీడియాతో మాట్లాడిన జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,రాష్ట్ర అంగన్వాడి విభాగ కార్యదర్శి శ్రీమతి వెంకట్ జ్యోతి, 37వ డివిజన్ కార్పొరేటర్ మరియు నెల్లూరు నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్,జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాసరావు RSR, మాజీ కార్పొరేటర్ మరియు మున్సిపల్ విభాగ అధ్యక్షులు నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి.రాష్ట్ర వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 లో ఇదివరకటి కమిటీలన్నీ జగన్ మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది.మీరు మీ నగర అధ్యక్షుడు పదవిని ఆనం విజయకుమార్ రెడ్డి తీసేసారని అబండం వేశావు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం గ్రామీణ మరియు మండల కమిటీలు, డివిజన్ కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు,రాష్ట్ర కమిటీల్లో నాయకులుకి కార్యకర్తలు కి వారి వారి స్థాయిని బట్టి హార్డ్ వర్క్ ని బట్టి చిన్న పెద్ద స్థాయిలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కొన్ని వేల పదవిలిచ్చి గ్రౌండ్ లెవెల్ లో మళ్లీ తిరిగి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగత నిర్మాణ దిశగా ఏర్పాటు చేసి చాలా బలంగా పార్టీని బలోపేతం చేస్తున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి పైన అబద్ధాలతో వ్యాఖ్యలు చేశావు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి విజయ్ కుమార్ రెడ్డి గారికి ఎటువంటి మనస్పర్ధలు లేవు,కోవర్ట్లు గా పనిచేస్తున్న మీరు వారి మధ్య గ్యాప్ సృష్టిస్తున్నారు, లేనిపోని మనస్పర్ధలు మీరే క్రియేట్ చేస్తున్నారు.ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఇప్పటికీ నెల్లూరు రూరల్ వైసిపి నాయకులు అందరూ గౌరవంగా అభిమానంగా ఉన్నారు.మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన మరుగుదొడ్లు స్థలంలో మీరు అక్రమంగా నిర్మించిన మీ బిల్డింగ్ ని మున్సిపల్ అధికారులు తొలగిస్తే మీరు అనవసరంగా ఆనం విజయకుమార్ రెడ్డి మీద అబండాలు వేశారు.ఆనం విజయకుమార్ రెడ్డి కి మున్సిపల్ వార్డులతో అప్పట్లో ఏం సంబంధం ఉంది మీకు తెలియదా మున్సిపల్ వార్డుల్లో ఎక్కడ కూడా వేలు పెట్టిన దాఖలాలే ఉన్నాయా, ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ ఎవ్వరికి హాని గాని నష్టం గాని చేయలేదు మీలాగా అక్రమంగా ఎప్పుడూ సంపాదించలేదు.ఎంతో మంచి పేరు తెచ్చుకుంటూ అందరి మన్ననలు పొందుతున్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పైనా నిందలు వేశావు,అధికార పార్టీ నాయకులతో లోపాయికారితనం తో పార్టీకి ద్రోహం చేస్తూ నీ వ్యాపారాల కోసం జిల్లా పరిషత్ పైన కూడా అనవసరమైన విమర్శలు చేస్తూ నీ స్వార్ధం కోసం పార్టీకి నష్టం కలిగిస్తున్నారు.మీరు చెప్పిన ఆ 5,6 మంది సీనియర్ నాయకులే కదా అధికార పార్టీవాళ్ళతో ఫోన్స్ మాట్లాడుతూ కోవర్టులుగా పని చేసి మన పార్టీలో ఉన్న వాళ్ళని ఆ పార్టీలోకి బలవంతంగా పంపించి పెద్దలు ఆదాల ఇమేజ్ ని వారి ఆఫీస్ ని నాశనం చేసింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జిలు, నెల్లూరు రూరల్ మండల కమిటీ సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.