మన న్యూస్, నెల్లూరు:- 'విపిఆర్ విద్య” పాఠశాలలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థి పైచదువుకు ప్రోత్సాహం. - చెక్కు అందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . అన్ని దానాలలో విద్యా దానం గొప్పదన్న విషయాన్ని ఆచరణలో అమలు చేసి చూపుతున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు. ఎందరో నిరుపేద విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు వారధిగా నిలుస్తున్న VPR ఫౌండేషన్.. ప్రతిభ మరియు పేదరికమే అర్హతగా ఉచిత విద్య అందిస్తోంది. ఆ పాఠశాలలో 2023-24 సంవత్సరంలో చదివి టాప్ మార్కులు సాధించిన ఉదయగిరి లక్ష్మి చరణ్ అనే విద్యార్థికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఉన్నత చదువుల ఖర్చు భరిస్తానని నాడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 2024లో ఇంటర్ మొదటి సంవత్సరం ఫీజు చెల్లించిన విపిఆర్ దంపతులు.. బుధవారం ఇంటర్ రెండో సంవత్సరం ఫీజును చెల్లించారు. ఈ మేరకు విపిఆర్ నివాసంలో విద్యార్థికి చెక్కును అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కి విద్యార్థి తండ్రి సురేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ కుమారుడి చదువుల ఖర్చును భరిస్తున్న వారి రుణం జన్మలో తీర్చుకోలేమని చెబుతున్నారు.