శంఖవరం మన న్యూస్ (అపురూప్) క్వారీలు వల్ల పల్లె గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సామాజిక కార్యకర్త మేకల కృష్ణ గళమెత్తారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామంలో సర్వే నెంబరు 15 రోడ్డు మెటల్ క్వారీ అనుమతుల కోసం అధికార యంత్రాంగం నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణ సభలో స్థానికులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. సభకు హాజరైన స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు కొత్తగా క్వారీకి అనుమతులు ఇవ్వద్దని బహిరంగంగా అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రాంత దీర్ఘ కాలం గా రౌతులపూడి శంఖవరం మండలాల పరిధిలోని ఎస్. పైడిపాల, గుమ్మరేగులు, బంగారయ్య పేట, శృంగవరం, మెరక చామవరం, శాంతి ఆశ్రమం జంక్షన్, నెల్లిపూడి, కత్తిపూడి వంటి గ్రామాలలో అనుమతులున్న క్వారీల నుండి తరలిస్తున్న నల్లరాయి, లేటరైట్, గ్రావెల్ టిప్పర్లు రహదారులను తీవ్రంగా దెబ్బతీసాయని సామాజిక కార్యకర్త మేకల కృష్ణ మరియు స్థానికులు ద్వజమెత్తారు. అత్యధిక బరువుతో నలబెట్టాల నుండి 60 టన్నుల వరకు నిత్యం సాగుతున్న రవాణా వల్ల పంచాయతీ రోడ్లు ధ్వంసం అవుతున్నాయని రోడ్లపై వేసిన హై స్పీడ్ వాహనాలు కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాక ఈ రవాణాలో పుట్టే దూళి ధ్వని వల్ల గ్రామంలోని ప్రజలు అనేక వ్యాధులకు గురవుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. కొత్తగా ఎటువంటి క్వారిలకు కూడా అనుమతులు ఇవ్వకుడదని, రోడ్లపై తిరుగుతున్న టిప్పర్లకు ప్రత్యేక రవాణా మార్గాలు ఏర్పాటు చేయాలని ఎస్ పైడిపాల జల్దాం రాఘవపట్నం ప్రాంతాల నుంచి నేరుగా కత్తిపూడి జాతీయ రహదారిని కలిపే ప్రత్యేక రోడ్డు నిర్మించాలని కోరారు. బాధిత గ్రామాల ప్రజలు అధికారుల ఎదుట తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహాగా శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభకు పెద్దాపురం ఆర్డీవో రమణి తహసిల్దార్ ఎస్ వి నరేష్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి శంకరరావు తదితర అధికారులు హాజరయ్యారు.