మన న్యూస్,తిరుపతి, :
తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి కావడంతో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టౌన్ క్లబ్ సర్కిల్లో గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి గజపూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటుచేసిన భారీ కేకును మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ చేతులు మీదుగా కట్ చేసి పార్టీ నేతలు కార్యకర్తలు ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సంబరాలలో డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వి పుష్పావతి యాదవ్, దంపూరి భాస్కర్ యాదవ్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్ పి శ్రీనివాసులు, టిడిపి నగర అధ్యక్షులు వట్టికుంట చిన్నబాబు, ఎం ఆర్ పల్లి రామచంద్రారెడ్డి, జె డబ్ల్యూ విజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.