మన న్యూస్,తిరుపతి, :
తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఓటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయవంతం అయిందని తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. గురువారం రేణిగుంట రోడ్డు లోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో కూటమి ప్రభుత్వ ఏడాదిపాలన విజయోత్సవ సంబరాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. గత వైసిపి అవినీతి పాలనకు, అరాచక ప్రభుత్వానికి స్వస్తి పలుకుతూ అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాలిలో పెడుతూ సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో తొలి సంవత్సరం విజయవంతంగా పూర్తి అయిందని నేతలు తెలిపారు. సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పార్టీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అక్కడున్న పార్టీ నేతలు కార్యకర్తలు పంచిపెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవ సంబరాలలో డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, ఊకా విజయ్ కుమార్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి నైనా ర్ మహేష్ యాదవ్, టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి, టిడిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, జె బి శ్రీనివాస్, ఊట్ల సురేంద్ర నాయుడు, యశ్వంత్ రెడ్డి, చెంబకూరు రాజయ్య, పార్టీ రాష్ట్ర జిల్లా నేతలు పాల్గొన్నారు.