నాగోల్. మన న్యూస్ :-టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టి పి సి సి అధ్యక్షుడు , ఎమ్ ఎల్ సి మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేసిన టీ పి పి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త . ఈ సందర్భగా మహేష్ కుమార్ బొమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేలా,పార్టీ పటిష్ఠతకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. టీ పి పి సి ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు మహేష్ కుమార్ గౌడ్ కి ఉప్పల శ్రీనివాస్ గుప్త కృతజ్ఞతలు తెలిపారు.