మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.......నందమూరి బాలకృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ రోజు నెల్లూరులో కోటంరెడ్డి శీనన్న ఆధ్వర్యంలో నిర్వహించిన బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.నా చిన్నతనంలో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాలు చూశాను అని అన్నారు.కాలేజీ రోజుల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సూపర్ హిట్లు అని అన్నారు.నా కుమారుడు వచ్చేసరికి అఖండ, డాకూ మహరాజ్ హైలెట్.. అని అన్నారు.ఓ రోజు అఖండ సినిమాకి వెళ్లొచ్చిన నా కుమారుడు త్రిశూలంతో వచ్చాడు..డాకూ మహారాజ్ చూసొచ్చి గుర్రం కావాలని కోరాడు అని అన్నారు.నటనతో అన్ని తరాల వారిని మెప్పించిన ఘనత ఒక్క బాలయ్య బాబుకే దక్కుతుంది అని అన్నారు.అప్పుడే పుట్టిన పిల్లలు కూడా జైబాలయ్య అంటున్నారు..అది ఆయన సత్తా అని అన్నారు.రాజకీయాల్లో బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యే... అని అన్నారు.సేవా కార్యక్రమాల్లోనూ ఆయనది పెద్దమనసు...బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి ద్వారా వేలాది మందికి వైద్యసేవలందిస్తున్నారు అని అన్నారు.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో బాలయ్య బాబు నిండు నూరేళ్లు వర్థిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శీనన్న రూపంలో మనకు జూనియర్ బాలయ్య అందుబాటులో ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.