త్వరలో సర్వేపల్లిలో ప్రీమియర్ లీగ్....... సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మన న్యూస్,సర్వేపల్లి, జూన్ 10:*దొరువులపాళెంలో నిర్వహించిన లీగ్ స్ఫూర్తితో టోర్నమెంట్ నిర్వహణ.ముత్తుకూరు మండలం దొరువులపాళెంలో SBVS ప్రీమియర్ లీగ్ బహమతి ప్రదానోత్సవంలో టీడీపీ సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.టోర్నమెంటును అద్భుతంగా నిర్వహించారని నిర్వాహకులకు అభినందన.గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగిన క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయన్న రాజగోపాల్ రెడ్డి.SBVS టోర్నీ నిర్వాహకుల సహకారంతో భారీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తామని ప్రకటించిన సోమిరెడ్డి.విజేతలకు బహుమతులు అందజేసిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి, ముత్తుకూరు మండల టీడీపీ నేతలు.