మన న్యూస్ తిరుపతి, తిరుపతి: తిరుపతి నగరంలోని ఎస్ టి వి నగర్ నడి వీధి గంగమ్మకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారంసారె సమర్ఫించారు. అనంతరం అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానికులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. కాగా 19వ డివిజన్ పరిధిలోని శేషాద్రినగర్ నడివీధి గంగమ్మ ఆలయంలో జరిగిన పూజలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజా రెడ్డి, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్, కూటమి నాయకులు శ్రీహరి నాయుడు, బలరాం రాయల్, బన్నీరాజు, సురేష్, సురేఖ, యశోదా, జశ్వంత్, రవి, శ్రావణ్, ప్రభాకర్, ప్రదీప్, ఓం ప్రకాష్, మధు, కళావతి, రంగారెడ్డి, మౌళి తదితరులు పాల్గొన్నారు.