తిరుపతి, మన న్యూస్జ: గద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 132వ జయంతి సందర్భంగా నగరంలో శోభా యాత్ర జరిగింది. కపిలతీర్థం నుంచి మొదలైన శోభాయాత్ర కంచిమఠం వరకు సాగింది. ఈ యాత్రలో కంచి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి , సత్య చంద్రశేఖర శంకరాచార్యులు పాల్గొన్నారు. అలాగే ఈ యాత్రలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన సతీమణి సత్యవతి తో కలిసి పాల్గొన్నారు. వీరిని శంకర విజయేంద్ర సరస్వతి ఆశ్వీరదించారు.