తిరుమల, మన న్యూస్: నందమూరి బాలకృష్ణ, పద్మభూషణ్ అవార్డు గ్రహిత బాలకృష్ణ జన్మదిన 65వ జన్మదిన వేడుకలు తిరుమలలోని అఖిలాండడం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బి శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలు సందర్భంగా 650 కొబ్బరి కాయలు కొట్టి, ఆరున్నర కేజీ, కర్పూరాన్ని హారతి గా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అటు సినీ రంగంతో పాటు ప్రజలకు ఆరోగ్యపరంగా నేను తోడున్నాను అంటూ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అనేకమందికి వైద్య సేవలో అందించడం జరుగుతున్నదని గుర్తు చేశారు. ఆయన ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుపేష్ వర్మ, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.