చిత్తూరు, ( వెదురు కుప్పం ) మన న్యూస్: విద్యా రంగానికి గౌరవాన్ని కలిగిస్తూ, విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభను ప్రోత్సహించేలా చిత్తూరు నగరంలో 'షైనింగ్ స్టార్ అవార్డ్స్ – 2025' ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యాభివృద్ధిలో రాణించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వెదురుకుప్పం మండలానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఉత్తమ మార్కులు సాధించినందుకు గాను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రోత్సహించారు.ఈ వేడుకలో వెదురుకుప్పం మండల అధ్యక్షుడు లోకనాథ్ రెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ కుప్పయ్య, బూత్ కన్వీనర్ షణ్ముఖ రెడ్డి, యువ నాయకుడు రాజాజీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విద్యారంగంలో ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇలాంటి అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు.అలాగే ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ మాట్లాడుతూ... "గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ప్రతిభలో ఏ మాత్రం తక్కువకాదని, ప్రభుత్వం అందించే వనరులను ఉపయోగించుకుని విజయం సాధించాలని" అభిప్రాయపడ్డారు. ఆయన విద్యార్థులను అభినందిస్తూ వారికి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, యువత నాయకులు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి పునాది వేస్తూ, ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, గ్రామీణ విద్యార్థులకు ఇది మంచి ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.