మన న్యూస్, నెల్లూరు : నిరుపేదలు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను దగ్గర్నుంచి చూశాను కాబట్టే.. ప్రతి స్టూడెంట్ కి నాణ్యమైన విద్యను అందించాలని వి ఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దుతున్నానని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పేద పిల్లల కోసం సిద్ధమవుతున్న విఆర్ హైస్కూల్‌ను చూసేందుకు మంత్రితోపాటు పలువురు టిడిపి మహిళలు వచ్చారు. ప్లేగ్రౌండ్ లో ఉన్న ఎక్విప్మెంట్స్ ని చూసి ఆశ్చర్యము వ్యక్తం చేశారు. విఆర్ హైస్కూల్ రూపురేఖల్ని మంత్రి మార్చేశారు అంటూ అభినందనలు తెలిపారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన విఆర్ హైస్కూల్ లో తన విద్యాభ్యాసం జరిగిందని అయన గుర్తు చేసుకున్నారు.. ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు చేర్చిన విఆర్ హైస్కూల్‌ను గత ప్రభుత్వం మూసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని మరో వారం రోజుల్లో అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. కుమార్తె షరిణి ఈ బాధ్యతలు చూసుకుంటున్నారని ఆయన మీడియాకు తెలిపారు. చదువులతోపాటు క్రీడలు కూడా విద్యార్థులకు చాలా అవసరం అని అందుకే ప్లేగ్రౌండ్ ని కూడా సుందరంగా తీర్చిదిద్దామని వివరించారు. తన కుమార్తె షరిణి 20 నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుంటుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి కలెక్టర్ కార్తీక్ ,కార్పొరేషన్ కమీషనర్ నందన్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ,టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు ,మాజీ జడ్పీటీసీ విజేతా రెడ్డి ,డివిజన్ల ఇంచార్జులు ,టీడీపీ మహిళలు పాల్గొన్నారు .