మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (08-06-2025, ఆదివారం) రాత్రి 8 గంటలకు హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు హంస వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. హంస వాహనం జ్ఞానాన్ని, పవిత్రతను బలంగా సూచిస్తుంది. ఈ వాహనంపై దర్శనమిచ్చే స్వామివారు భక్తులకు జ్ఞానోదయాన్ని ప్రసాదించనున్నారన్న విశ్వాసం ఉంది.వాహనం పుష్పాలతో, విద్యుత్ అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ భక్తులు స్వామివారికి ఘనంగా హారతులు సమర్పించారు. విశేషంగా హాజరైన భక్తజనం స్వామివారి హంస వాహన దర్శనంతో మంత్రముగ్ధులయ్యారు.