మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో శనివారం రాత్రి మద్యం మత్తులో జరిగిన ఘర్షణ తీవ్ర గాయానికి దారి తీసింది. ఈ ఘటనలో తన్నీరు రవి (45) కూలీ పని చేసుకునే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.శనివారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో, రవి తన ఇంటి ముందు బింగినపల్లి గ్రామానికి చెందిన మారుబోయిన మణికంఠ(20) మరియు మరొక వ్యక్తి కలిసి మద్యం సేవిస్తున్నారని గమనించాడు. నివాసాల మధ్య మద్యం తాగొద్దని, వేరే చోటుకు వెళ్లాలని వారిని రవి హెచ్చరించగా, మద్యం మత్తులో ఉన్న మణికంఠ బీరు సీసాతో రవి తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ఘటనలో రక్తస్రావం కావడంతో అతడిని 108 అంబులెన్స్ ద్వారా కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.దాడి చేసిన మణికంఠ గతంలోనూ నేరాలకు పాల్పడిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ మహేంద్ర వెల్లడించారు.