మనన్యూస్, తవణంపల్లె నవంబర్-23:- పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో విద్యార్థుల దగ్గర గంజాయి దొరకటం దురదృష్టకరం, బాధాకరం. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ మరియు రిజిస్టర్ యొక్క చేతకానితనం వలన, పర్యవేక్షణ లోపం వలన ఈరోజు విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల హాస్టల్ లో గంజాయి దొరకటం బాధాకరం. సాక్షాత్తు రాష్ట్రపతి విసిటర్ గా ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో గంజాయి స్వైర విహారం చేయటం దురదృష్టకరం. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ చాన్సిలర్ గా ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయం పవిత్రతను స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దెబ్బతీశారు. విశ్వవిద్యాలయంలో హాస్టల్ ల పైన, విద్యార్థుల పైన పర్యవేక్షణ నిఘా కొరవడింది. పవిత్రమైన విశ్వవిద్యాలయం, ఈ విధంగా గంజాయి నిలయంగా మారిపోవడం విశ్వవిద్యాలయం యొక్క ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చింది. సాక్షాత్తు విసి తన యొక్క ఛాంబర్ లో కూర్చొని తంబాకు, ఖైని, గుట్కా తింటూ విశ్వవిద్యాలయం ప్రతిష్ట దిగజారుస్తున్నారు. విద్యార్థులకు గంజాయి ఎక్కడ నుండి సరఫరా అవుతుంది. ఎన్ని సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతుంది, గంజాయి సరఫరా చేసే ముఠాను ఉక్కు పాదంతో అణిచివేయాలి. విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని గంజాయి అమ్ముతున్నటువంటి గంజాయి సరఫరాదారుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.