Mana News:- వెదురు కుప్పం మన న్యూస్: స్మార్ట్ లాక్ తో దొంగతనాలకు చెక్ పేడతాం అని కార్వేటినగరం సీఐ హనుమంతప్ప కార్వేటినగరం ఎస్సై రాజకుమార్ అన్నారు… శనివారం కార్వేటినగరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్వేటినగరం సిఐ హనుమంతప్ప మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్వేటి నగరం మండల పరిధిలో ఉన్న గుడి, మసీదు, చర్చిలు, ప్రదేశాలలో దొంగతనాలను అరికట్టడానికి స్మార్ట్ లాక్కు లను ఏర్పాటు చేస్తాం మొదట విడతగా 100 స్మాట్ లాక్ ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ లాక్క ల వలన ఎవరైనా దొంగతనాలు చేయదలచిన స్మార్ట్ లాక్ ను పగలగొట్టడానికి ప్రయత్నిస్తే ఆ అలారం మోగి సిబ్బందిని అలర్ట్ చేయడమే కాకుండా ఇదివరకే అమర్చిన సిసి కెమెరాలు ద్వారా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఎవరైనా తమ ఇళ్లకు కూడా స్మార్ట్ లాక్ అవసరమైతే పోలీసు వారు వారికి సహకరిస్తారు అని సిఐ హనుమంతప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు