మన న్యూస్: పినపాక, ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలు సురక్షితమైన కాన్పులు జరుగుతాయని వైద్యాధికారిని దుర్గాభవాని అన్నారు. పినపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొగ్గూడెం గ్రామానికి చెందిన బుర్కా స్వాతికి డాక్టర్ దుర్గ భవాని నాలుగవ కాన్పు సుఖ ప్రసవం చేయగా మగ బిడ్డ జన్మించింది. కాన్పు అనంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యురాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం లభిస్తుందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.