కొండాపురం, మన న్యూస్ : కొండాపురం మండలం ముస్లిం సోదరీ సోదరమణులకు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు.
ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం దురాచారాలను, బడుగు మరియు బలహీన వర్గాల అణచివేతను వ్యతిరేకించి ధర్మ సంస్థాపన కోసం మరియు పేదల ఉద్ధరణకు యుగపురుషుడు అజ్రత్ ఇబ్రహీం జీవితాంతం చేసిన త్యాగాలకు ప్రతీకగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకొంటారు. పేదలకు దానధర్మాలు చేయాలనే గొప్ప ధ్యేయంతో ఏర్పాటుచేసిన పండుగ బక్రీద్ పండుగ.
పేదలకు దానధర్మాలతో – భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగను అందరు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. కొండాపురం మండలం ముస్లిం సోదరీ సోదరమణులకు మరో సారి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.