మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్) రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్,శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి,డాక్టర్ రేవంత్ అన్నారు. గురువారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో మాల్తుమ్మెద శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ..పంటలు సాగు చేసేటప్పుడు యూరియా వాడకం తగ్గించాలన్నారు. ఫర్టిలైజర్ షాపులో విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు కొన్నప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బిచ్కుంద వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అమినాబీ,మహమ్మద్ నగర్ మండల వ్యవసాయ అధికారిణి నవ్య,జుక్కల్,బాన్సువాడ హార్టికల్చర్ అధికారి సుమన్, ఏఈఓలు సాగర్,స్వర్ణలత, ఉద్యానవన క్లస్టర్ అధికారి మహ్మద్ నదీమ్, రైతులు పాల్గొన్నారు.