ఎల్బీనగర్. మన న్యూస్ : జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల కాలుష్యం - నియంత్రణ ఆవశ్యకతపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల నిర్వహించిన పోటీల్లో నాటికల విభాగంలో వనస్ధలిపురం జాగృతి అభ్యుదయ సంఘం గ్రీన్ సోల్జర్స్ ప్రదర్శించిన "గంగా" నాటికకు ప్రధమ, తృతీయ బహుమతులు గెలుచుకుంది. కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయం సనత్ నగర్ లో నిర్వహించిన బహుమతుల పంపిణీ కార్యక్రమానికి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అహమద్ నదీమ్ ఐ ఏ ఎస్ , TGPCB సభ్య కార్యదర్శి రవి కుమార్ ఐ ఏ ఎస్ , సోషల్ సైంటిస్ట్. ప్రసన్నకుమార్ తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా... జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్ సంతోషం వ్యక్త పరుస్తూ పర్యావరణ పరిరక్షణకై తమ మీద మరింత బాధ్యతలు పెరిగాయని భావిస్తున్నట్లుగా అన్నారు.కార్యక్రమంలో శ్యామల దేవి, దారుణ్య, బాలజ్యోతిలు పాల్గొనగా ప్రధమ విజేతలైన నటీ నటులు జీవన, అనూష, మణికంఠ, చంద్రశేఖర్,సిద్దిక్ష తృతీయ విజేతలు అక్షిత,మహాలక్ష్మి, నిహారిక, శ్రద్ధ, సాయి అక్షయ్ బహుమతులు అందుకున్నారు...-భావన శ్రీనివాస్, ఫౌండర్ & ఛైర్మన్ - జాగృతి అభ్యుదయ సంఘం.